న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనకు మొట్టమొదటిసారిగా డిజటల్ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ప్రజలు ఇంటి నుంచే తమ వివరాలు నమోదు చేసుకునేలా ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలోని పౌరుల ఇండ్ల వివరాలతో పాటు జన గణనను ఇదే పోర్టల్ ద్వారా నిర్వహించనున్నట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా హౌజ్ లిస్టింగ్ అండ్ హౌజింగ్ సెన్సెస్(హెచ్ఎల్వో)ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఇండ్ల స్థితిగతులు, సౌకర్యాలు, ఆస్తుల వివరాలను నమోదు చేయనున్నారు. ఆ తర్వాత జన గణన పూర్తి చేయనున్నారు.
దేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ విధానంలో జన గణనకు కేంద్రం శ్రీకారం చుట్టబోతున్నది. ఎన్యుమరేటర్లు తమ వద్ద ఉన్న సెల్ఫోన్లలోని యాప్‌లో పూర్తి వివరాలను నిక్షిప్తం చేయనున్నారు.