Flash floods | భారీ వర్షాల కారణంగా నేపాల్-చైనా (Nepal -China) సరిహద్దులో ఆకస్మిక వరదలు పోటెత్తాయి (Flash floods). ఈ వరదలకు ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అంతేకాదు, డ్రైపోర్టు వద్ద నిలిపి ఉంచిన వందలాది వాహనాలు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చైనా భూభాగంలో భారీ వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వర్షాలకు రసువా (Rasuwa) జిల్లాలోని భోటెకోషి నది (Bhotekoshi River)కి వరద ప్రవాహం పెరిగింది. నది ఉద్ధృతికి మిటేరీ వంతెన కొట్టుకుపోయింది. నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపిన దాదాపు 200కిపైగా వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు రసువా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అర్జున్ పౌడెల్ తెలిపారు. నేపాల్‌కు చెందిన పలువురు వ్యాపారులు, 12 మంది పోలీసులు వరదల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఆకస్మిక వరదలతో అప్రమత్తమైన నేపాల్ అధికారులు ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ వరదలకు ఎంతమంది కొట్టుకుపోయారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు.
Also Read..
Texas | టెక్సాస్‌లో మెరుపు వరదలు.. నిమిషాల్లోనే మాయమైన రోడ్డు.. షాకింగ్ వీడియో
Asteroid | భూమి దగ్గర నుంచి దూసుకెళ్లిన ఆస్టరాయిడ్.. తిరిగి మూడేళ్ల తర్వాత..!
Trump Tariffs | భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి దగ్గరలో ఉన్నాం: డొనాల్డ్ ట్రంప్