Reel : సోషల్ మీడియా (Social Media) మోజులో పడిన కొందరికి రీల్స్ (Reels) పిచ్చి పెరుగుతోంది. ప్రమాదకర రీతిలో రీల్స్ చేసేందుకు ప్రయత్నించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వ్యక్తి రీల్స్ కోసం తన కుమార్తె ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం భరత్పూర్ జిల్లా (Bharathpur district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భరత్పూర్ జిల్లాకు చెందిన ఉమాశంకర్‌కు బాగా రీల్స్ పిచ్చి పట్టుకుంది. ఎప్పుడూ ఏదో ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం అతడికి అలవాటుగా మారింది. ఈ క్రమంలో తాజాగా అతడు తన కుమార్తె ప్రాణాలనే పణంగా పెట్టి రీల్ చేశాడు. ఆ రీల్ కోసం తన కూతురిని బంద్ బరైతా రిజర్వాయర్‌పై ఉన్న ఇనుప ఫ్రేమ్‌పై కూర్బోబెట్టాడు. బాలిక భయపడుతున్నా వినకుండా ఆమె ఇనుప ఫ్రేమ్ కూర్చునేలా బలవంతపెట్టాడు.
ఈ సందర్భంగా ఉమాశంకర్ భార్య కూడా అతడి పక్కనే ఉంది. అక్కడి నుంచి జారిపడితే కుమార్తె దక్కదన్న సోయి కూడా లేకుండా ఆమె భర్తకు సహకరించడం విడ్డూరంగా ఉంది. ఒకవైపు కుమార్తె భయంతో వణికిపోతుంటే తల్లి తాపీగా నవ్వడం కనిపించింది. పెద్ద ఘనకార్యం చేసినట్లు ఆ వీడియోను ఉమాశంకర్ సోషల్ మీడియాలో పెట్టాడు.
అయితే ఆ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలిక ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఉమాశంకర్ దంపతులపై వారు మండిపడుతున్నారు. వ్యూస్, లైకుల కోసం బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నెటిజన్ల చీవాట్లు పెరగడంతో చివరికి ఉమాశంకర్ తన అకౌంట్ నుంచి ఆ రీల్‌ను తొలగించాడు. ఆ రీల్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
రీల్స్ పిచ్చిలో కూతురు ప్రాణాలను పణంగా పెట్టిన తండ్రి
రీల్స్ కోసం కూతురిని ప్రమాద స్థాయిలో ఉన్న ఒక రిజర్వాయర్ పై బలవంతంగా కూర్చబెట్టిన తండ్రి
రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ జిల్లా
బంద్ బరైతా రిజర్వాయర్ పై ప్రమాద స్థాయిలో ఉన్న ఇనుప ఫ్రేమ్ పై రీల్స్ కోసం తమ కూతురిని… pic.twitter.com/gYg8YCC1MB— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025