Bouncers : ఓ ఫైవ్ స్టార్ హోటల్ (Five-star hotel) లోని నైట్ క్లబ్ (Nightclub) లో యువతి సహా ఇద్దరిపై బౌన్సర్లు (Bouncers) దాడికి పాల్పడ్డారు. క్లబ్లో టాయిలెట్స్ (Toilets) శుభ్రంగా లేవన్నందుకు ఆ ఇద్దరిని బౌన్సర్లు కొట్టారు. ఢిల్లీలోని అశోకా రోడ్ (Ashoka road) లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్లోని నైట్‌క్లబ్‌లో జూలై 1న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. విజయ్ మల్హోత్రా (23), తన మరదలు శశి జగ్గీ (Shashi Jaggi) తో కలిసి నైట్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయని విజయ్ మల్హోత్రా చెప్పడంతో బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన శశి జగ్గీపై కూడా దాడి చేశారు. అనంతరం ఇద్దరిని బెదిరించి క్లబ్ నుంచి బయటకు గెంటేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి అరెస్టులు చోటుచేసుకోలేదు.