లక్నో: ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. (BJP MLAs Clash) ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి ముందుకు వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం ‘విజన్ 2047’ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార పార్టీ తరపున ఎవరు మాట్లాడాలో నిర్ణయించే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాదన ప్రారంభమైంది.
కాగా, వారణాసి బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవతో మథుర బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ చౌదరి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆయన తన పేరును స్పీకర్‌కు ఫార్వార్డ్ చేయడం లేదని రాజేష్ చౌదరి ఆరోపించారు. ముందు సీటులో కూర్చొన్న సౌరభ్ శ్రీవాస్తవపై దాడి చేసేందుకు తన సీటు నుంచి పైకి లేచారు. అయితే మిగతా సభ్యులు రాజేష్ చౌదరిని సముదాయించారు. ఆయన దాడి చేయకుండా నిలువరించారు.
మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఘర్షణ పడిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘అసభ్యకరమైన ప్రవర్తన’ ‘అసభ్యకరమైన భాషను’ ఉపయోగించే నాయకులను బీజేపీ ప్రోత్సహిస్తున్నది’ అని విమర్శించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बदसलूकी और बदज़ुबानी ही भाजपा में तरक़्की की सीढ़ी है।
निंदनीय! pic.twitter.com/uUxQd61sGc
— Akhilesh Yadav (@yadavakhilesh) August 14, 2025
Also Read:
DK Shivakumar | ధర్మస్థల కేసులో ‘పెద్ద కుట్ర’ జరుగుతోంది: డీకే శివకుమార్
G Parameshwara | ద్వేషపూరిత ప్రసంగాలపై కర్ణాటకలో కొత్త చట్టం
Delivery Agent Dies As Car Explodes | బైక్‌ను ఢీకొట్టి పేలిన కారు.. డెలివరీ ఏజెంట్ సజీవ దహనం