బెంగళూరు: ధర్మస్థల కేసులో పెద్ద కుట్ర జరుగుతున్నదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆరోపించారు. ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, శతాబ్దాల నాటి సంప్రదాయాలను దెబ్బతీసేందుకు ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని కొందరు రూపొందించారని విమర్శించారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని అన్నారు. గురువారం విధానసౌధలో మీడియాతో డీకే శివకుమార్ మాట్లాడారు. దీర్ఘకాలంగా ఉన్న సంప్రదాయానికి అపఖ్యాతి తీసుకురావడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘ముసుగు ధరించిన వ్యక్తి కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. శివలింగెగౌడ, బేలూరు గోపాలకృష్ణ, అశోక్ రాయ్ సహా పలువురు నాయకులు సీఎల్పీలో దీని గురించి మాట్లాడారు’ అని అన్నారు.
కాగా, ఈ కేసు నిరాధారమైనదని, శూన్యమైనది, ఎలాంటి అర్ధం లేనిదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఏవైనా తప్పుడు ఆరోపణలు లేదా కుట్రలు ఉంటే క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ధర్మస్థలలో రాజకీయ జోక్యంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. సోమవారం ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను హోంమంత్రి అందజేస్తారని అన్నారు. మీడియా, సోషల్ మీడియా కథనాల గురించి ఆయన హెచ్చరించారు.
Also Read:
G Parameshwara | ద్వేషపూరిత ప్రసంగాలపై కర్ణాటకలో కొత్త చట్టం
Delivery Agent Dies As Car Explodes | బైక్ను ఢీకొట్టి పేలిన కారు.. డెలివరీ ఏజెంట్ సజీవ దహనం
Woman Robbed, Molested | వసతి గృహంలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి.. దోపిడీ చేసిన వ్యక్తి
Woman Gang-Raped At Friend’s Party | స్నేహితురాలి ఇంట్లో పార్టీ.. మహిళపై సామూహిక అత్యాచారం