బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వసతి గృహంలోని ఆమె రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆ మహిళను కత్తితో బెదిరించాడు. బంగారు గాజులు, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. (Woman Robbed, Molested) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల మహిళ బెస్కామ్లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నది. జ్యుడీషియల్ లేఅవుట్లోని పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో 15 రోజులుగా నివసిస్తున్నది.
కాగా, ఆగస్ట్ 11న మధ్యాహ్నం 3 గంటలకు డ్యూటీ తర్వాత వసతి గృహానికి ఆ మహిళ తిరిగి వచ్చింది. రూమ్ డోర్‌ను ఎవరో కొట్టడంతో పక్క రూమ్‌లోని మహిళగా భావించింది. డోర్ తీయగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె గదిలోకి ప్రవేశించాడు. ఆ మహిళ మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఆమె చేతికి ఉన్న బంగారు గాజులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
మరోవైపు చేతికి ఉన్న గోల్డ్ బ్యాంగిల్‌ను తీసేందుకు ఆ మహిళ ఇబ్బంది పడింది. దీంతో డబ్బులు ఇవ్వాలని ఆ వ్యక్తి అడిగాడు. తన బ్యాగు నుంచి తీసుకోవాలని ఆమె చెప్పింది. అతడి దృష్టి మళ్లడంతో వెంటనే బాత్రూమ్లోకి పరుగెత్తి డోర్ లాక్ చేసుకున్నది. లోపల నుంచి సహాయం కోసం కేకలు వేసింది. దీంతో ఆ మహిళకు చెందిన రెండు మొబైల్ ఫోన్స్ తీసుకుని ఆ వ్యక్తి పారిపోయాడు.
అనంతరం ఆ మహిళ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Gang-Raped At Friend’s Party | స్నేహితురాలి ఇంట్లో పార్టీ.. మహిళపై సామూహిక
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?