న్యూఢిల్లీ: స్నేహితురాలి ఇంట్లో జరిగిన పార్టీకి ఒక మహిళ వెళ్లింది. మత్తు మందు కలిపిన డ్రింక్‌ను ఆమెకు ఇచ్చారు. అది తాగి మత్తులో ఉన్న ఆ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Woman Gang-Raped At Friend’s Party) బాధితురాలి ఫిర్యాదుతో స్నేహితురాలితోపాటు ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి సివిల్ లైన్స్‌లో నివసిస్తున్న స్నేహితురాలి ఇంట్లో జరిగిన పార్టీకి 24 ఏళ్ల మహిళ హాజరైంది. ముగ్గురు మగవారు కూడా అక్కడ ఉన్నారు.
కాగా, మత్తుమందు కలిసిన డ్రింక్ తనకు ఇచ్చారని ఆ మహిళ తెలిపింది. అది తాగిన తర్వాత
స్పృహలో లేని తనను ముగ్గురు వ్యక్తులు టాయిలెట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. దీనిని రికార్డ్ చేశారని, ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు తనను కారులో ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోయినట్లు చెప్పింది.
మరోవైపు బాధిత మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆమె స్నేహితురాలు, ముగ్గురు మగవారితో సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అదృశ్యమైన వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?
Watch: స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. ఆమె ఏం చేసిందంటే?