ముంబై: ఒక యువకుడు ప్రియురాలితో కలిసి కేఫ్‌లో ఉన్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా కొందరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ యువకుడితో ఘర్షణ పడ్డారు. అనంతరం అతడ్ని ఒకచోటకు తీసుకెళ్లి కొట్టి చంపారు. (Man With Teen In Cafe Lynched) మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 11న సాయంత్రం వేళ జామేనర్కు చెందిన 20 ఏళ్ల సులేమాన్ ఖాన్ 17 ఏళ్ల యవతితో కలిసి ఒక కేఫ్‌లో ఉన్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా సుమారు పది మంది వ్యక్తులు అక్కడకు వచ్చారు. సులేమాన్ ఖాన్‌తో వారు ఘర్షణ పడ్డారు. కేఫ్ నుంచి బయటకు వచ్చిన అతడ్ని అనుసరించారు. ఒకచోట సులేమాన్ ఖాన్‌ను దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
కాగా, ఈ సంఘటన జామేనర్లో ఉద్రికత్తకు దారి తీసింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. సులేమాన్ ఖాన్‌ను కొట్టి చంపిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరి కొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముస్లిం యువకుడ్ని ఆ గుంపు కొట్టి చంపడానికి కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?
Watch: ఏటీఎం నుంచి డబ్బులు చోరీకి దొంగ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. ఆమె ఏం చేసిందంటే?