కోల్‌కతా: సిగ్నల్ వద్ద ఆగిన బైక్‌ను ఒక కారు ఢీకొట్టింది. ఆ రాపిడికి అది పేలింది. దీంతో బైక్‌పై ఉన్న డెలివరీ ఏజెంట్ మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు. (Delivery Agent Dies As Car Explodes) బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి రోడ్డుపై పడి గాయపడ్డాడు. అయితే ఆ కారులో ఉన్న వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. దక్షిణ 25 పరగణాలలోని బసంతికి చెందిన 22 ఏళ్ల సౌమెన్ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. కుటుంబానికి అండగా ఉండేందుకు కోల్‌కతాలో డెలివరీ ఏజెంట్‌గా, బైక్ రైడర్‌గా పని చేస్తున్నాడు.
కాగా, బుధవారం సాయంత్రం ఒక వ్యక్తిని బైక్‌పై సౌమెన్ ఎక్కించుకున్నాడు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్‌పై ఆగి ఉన్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు ఆ బైక్‌పైకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న ఇనుప రెయిలింగ్‌పైకి బైక్‌ను నెట్టింది. దీంతో సౌమెన్ అక్కడ చిక్కుకున్నాడు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి గాలిలో ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
మరోవైపు ఆ కారు ఉన్నట్టుండి పేలిపోయింది. దీంతో రెయిలింగ్ వద్ద చిక్కుకున్న సౌమెన్ మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు. అయితే ఆ కారులో ఉన్న వారిని స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు.
కాగా, పోలీసులు వెంటనే స్పందించి సౌమెన్ను కాపాడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ 25 పరగణాలలో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#CCTV footage from #SaltLake shows a speeding car losing control and hitting a delivery boy, killing him instantly. Passengers were rescued, but an open railing at the site may make gathering forensic evidence difficult.
Read: https://t.co/NllfhFQ3P5#Kolkata #WestBengal #Death pic.twitter.com/h45bXaNgQl
— Taaza TV (@taazatv) August 14, 2025
#BreakingNews: ‘পুলিশ দাঁড়িয়ে ভিডিয়ো বানাচ্ছে,’ সল্টলেকে ডেলিভারি বয়কে গাড়ির ধাক্কা, তার পরে আগুনে ঝলসে মৃত্যু, দমকলের গাড়ি ভাঙচুর উত্তেজিত জনতার।#Fire #Accident #Death #EkhonKolkata pic.twitter.com/huM4PGLcU6
— EkhonKolkata (@EkhonKolkata) August 13, 2025
Also Read:
Woman Robbed, Molested | వసతి గృహంలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి.. దోపిడీ చేసిన వ్యక్తి
Woman Gang-Raped At Friend’s Party | స్నేహితురాలి ఇంట్లో పార్టీ.. మహిళపై సామూహిక అత్యాచారం