అహ్మదాబాద్: గుజరాత్లో వేలాది మంది గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. (Gujarat Tribals Protest) పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది డ్యాముల నిర్మాణంతో మూడు ప్రధాన నదులను అనుసంధానించే పార్-తాపి నర్మదా లింక్ ప్రాజెక్టుపై దక్షిణ గుజరాత్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
కాగా, వల్సాద్ జిల్లాకు చెందిన వేలాది మంది గిరిజనులు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. డ్యామ్ హటావో సమితి బ్యానర్ కింద ఐక్యమయ్యారు. లారీలు, ట్రాక్టర్లలో వేలాది మంది ఆదివాసీలు ధరంపూర్కు తరలివచ్చారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధి నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పరిహారం వద్దని, ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వాన్స్డా ఎమ్మెల్యే అనంత్ పటేల్, కాంగ్రెస్ నేత అమిత్ చావ్డాతో సహా స్థానిక నాయకులు గిరిజనుల నిరసనకు మద్దతు తెలిపారు. అయితే ఎలాంటి ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
📍 वलसाड , गुजरात
हम बिरसा मुंडा और टंट्या मामा के वंशज हैं ✊🏹
जल–जंगल–ज़मीन पर नज़र डालने वालों को करारा जवाब मिलेगा।#ParTapiNarmada River Project सिर्फ़ गुजरात नहीं, पूरे देश के मूलनिवासियों का सवाल है।#Johar #AdivasiUnity #StopRiverLink pic.twitter.com/m9J6ZIoZvi— Dr.Vikrant Bhuria (@VikrantBhuria) August 14, 2025
Also Read:
dual voter ID card | బీహార్‌లో బీజేపీ మహిళా మేయర్‌కు రెండు ఓటరు కార్డులు.. ఈసీ నోటీసు
Woman Gang-Raped At Friend’s Party | స్నేహితురాలి ఇంట్లో పార్టీ.. మహిళపై సామూహిక అత్యాచారం
Watch: ఏసీ కోచ్‌లో కూలింగ్ లేదని ప్రయాణికుడు ఫిర్యాదు.. తర్వాత ఏం జరిగిందంటే?