లక్నో: రైలులోని ఏసీ కోచ్‌లో కూలింగ్ లేదని ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది, టెక్నీషియన్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆ కోచ్‌లోని ఏసీ క్యాబిన్లలో దాచిన వందకుపైగా లిక్కర్ బాటిల్ ప్యాకెట్లు బయటపడ్డాయి. (Liquor Bottles In AC Duct) ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 13న లక్నో-బరౌని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో విపిన్ కుమార్ ప్రయాణించాడు. అతడు రిజర్వ్ చేసుకున్న సీటు వద్ద చల్లదనం లేకపోవడంపై రైల్వేకు ఫిర్యాదు చేశాడు.
కాగా, గోండా సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ సిబ్బంది, ఏసీ టెక్నీషియన్ కలిసి ఆ కోచ్‌ను తనిఖీ చేశారు. అందులోని ఏసీ క్యాబిన్లను టెక్నీషియన్ పరిశీలించాడు. వాటిలో పేపర్ ప్యాకెట్లు దాచి ఉండటాన్ని అతడు గమనించాడు. ఆ కోచ్‌లోని అన్ని ఏసీ క్యాబిన్లలో దాచిన ఆ ప్యాకెట్లను బయటకు తీశాడు.
మరోవైపు ఆ పేపర్ ప్యాకెట్లు తెరిచి చూడగా 150కుపైగా లిక్కర్ బాటిల్స్ బయటపడ్డాయి. మద్యంపై నిషేధం ఉన్న బీహార్‌కు వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఆర్పీఎఫ్ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే కోచ్‌లోని ఏసీ క్యాబిన్ల నుంచి లిక్కర్ బాటిల్స్ ప్యాకెట్లు బయటకు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Passengers complained of low cooling in the AC coach of Lucknow-Barauni Express. When the technicians inspected the AC duct, consignment of a illict liquor was being hidden there.
Tecnologia! pic.twitter.com/Qad9Uis9dO
— Piyush Rai (@Benarasiyaa) August 14, 2025
Also Read:
dual voter ID card | బీహార్‌లో బీజేపీ మహిళా మేయర్‌కు రెండు ఓటరు కార్డులు.. ఈసీ నోటీసు
Woman Gang-Raped At Friend’s Party | స్నేహితురాలి ఇంట్లో పార్టీ.. మహిళపై సామూహిక అత్యాచారం