బెంగళూరు: ద్వేషపూరిత ప్రసంగాలపై కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానున్నది. ఆ రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర (G Parameshwara) ఈ విషయం చెప్పారు. సున్నితమైన తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు, సీసీటీవీలతో నిఘాను పెంచుతామని అన్నారు. హోంమంత్రి జీ పరమేశ్వర గురువారం మీడియాతో మాట్లాడారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే సంఘటనల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హింసను ప్రేరేపించే విధంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని తెలిపారు.
కాగా, జూన్ 11న దక్షిణ కన్నడ, శివమొగ్గ, ఉడిపి జిల్లాల్లో మత హింసను నియంత్రించడానికి ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి వెల్లడించారు. మీడియాలో ద్వేషపూరిత ప్రసంగం, మతపరమైన విషయాలను ఈ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. రెచ్చగొట్టే విషయాలను వ్యాప్తి చేసే వ్యక్తులపై నిఘా ఉంచుతుందని వివరించారు. ఉడిపి జిల్లాలోని 207 ప్రదేశాలలో 601 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక వేసిందని వెల్లడించారు.
Also Read:
Delivery Agent Dies As Car Explodes | బైక్ను ఢీకొట్టి పేలిన కారు.. డెలివరీ ఏజెంట్ సజీవ దహనం
Woman Robbed, Molested | వసతి గృహంలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి.. దోపిడీ చేసిన వ్యక్తి