Earthquake | హిమాలయ దేశం (Himalayan country) నేపాల్(Nepal)లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. గర్ఖాకోట్‌కు మూడు కి.మీ దూరంలో, 20కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది.
దీని తీవ్రతతో ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపనలు నమోదయ్యాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు చోట్ల భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. అంతకుముందు రోజు అంటే గురువారం మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో 2.6 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే.
Also Read..
Gold Card | ఇదిగో గోల్డ్ కార్డ్.. ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించిన ట్రంప్
బంగ్లాలో మైనారిటీలకు రక్షణ కల్పించండి.. యూనస్‌కు మోదీ సూచన
Wat Pho Temple: వాట్ పో బౌద్ద ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. వీడియో