బ్యాంగ్‌కాక్: ప్రధాని మోదీ థాయ్‌ల్యాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బిమ్స్టెక్ శిఖరాగ సదస్సులో పాల్గొనేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. అయితే ఇవాళ బ్యాంగ్‌కాక్‌లో ఉన్న వాట్ పో బౌద్ద ఆలయాన్ని(Wat Pho Temple) ఆయన సందర్శించారు. బౌద్ద మత గురువులు ఆయనకు స్వాగతం పలికారు. థాయ్‌ల్యాండ్‌లో ఉన్న బౌద్ద ఆలయాల్లో వాట్ పో చాలా ప్రసిద్ధి చెందినది. బౌద్ద మత పెద్దలు ప్రధాని చేత అక్కడ ప్రార్థనలు చేయించారు. థాయ్‌ల్యాండ్ ప్రధాని పెటంగ్టార్న్ షినావత్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#WATCH | PM @narendramodi, alongside Thai PM Paetongtarn Shinawatra, visited the revered Wat Pho Temple in Bangkok today.
Offering prayers at the iconic Reclining Buddha, PM Narendra Modi emphasized the message of ‘Vasudhaiva Kutumbakam’ for global peace and harmony.
A… pic.twitter.com/mGSMdlYUTw— PB-SHABD (@PBSHABD) April 4, 2025
వాట్ పో ఆలయాన్ని.. టెంపుల్ ఆఫ్ రిక్లైనింగ్ బుద్ద అని కూడా పిలుస్తారు. బ్యాంగ్‌కాక్‌లో ఉన్న బౌద్ద ఆలయ సముదాయంలో ఇది విశేషమైంది. శయనిస్తున్నట్లు ఉండే బుద్దుడి విగ్రహాన్ని కూడా మోదీ సందర్శించారు.