బ్యాంకాక్, ఏప్రిల్ 4: బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ మొదటిసారి భేటీ అయ్యారు. బంగ్లాదేశ్‌లో హిందువులతోసహా మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు. మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరారు. బిమ్స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు హాజరైన ఇద్దరు నేతలు విడిగా సమావేశమై 40 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ప్రజాస్వామిక, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల, సమీకృత బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఉంటుందని మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత, సరిహద్దుల్లో జరుగుతున్న హత్యలపై యూనస్ తన ఆందోళనను మోదీకి తెలియచేశారు.