లక్నో: రైల్వే క్రాసింగ్ వద్ద బైక్ను రైలు ఢీకొట్టింది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. (Train Hits Bike) పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 24న సాయంత్రం వేళ ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు వ్యక్తులు బైక్పై వెళ్తున్నారు. రౌజా రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ దాటుతుండగా లక్నో వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు ఆ బైక్ను ఢీకొట్టింది. దీంతో దానిపై ఉన్న ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మరణించారు.
కాగా, మృతులు లఖింపూర్ జిల్లాలోని వంకా గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
40 ఏళ్ల సేథ్పాల్, 38 ఏళ్ల భార్య పూజ, నాలుగు, ఆరేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు, సేథ్పాల్ బావ అయిన 45 ఏళ్ల హరి ఓంగా మృతులను గుర్తించారు. నిగోహి గ్రామంలోని హరి ఓం ఇంటికి వెళ్లిన ఆ కుటుంబం ఆయనతో కలిసి వంకా గ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
India tests K-4 missile | జలాంతర్గామి నుంచి.. అణ్వాయుధ సామర్థ్యమున్న కే-4 క్షిపణి పరీక్ష
Christmas Decorations Vandalised | షాపింగ్ మాల్లో క్రిస్మస్ డెకరేషన్.. ధ్వంసం చేసిన దుండగులు
Toxic Syrup Survivor | మృత్యువును జయించిన దగ్గు మందు బాధిత బాలుడు.. కంటిచూపు కోల్పాయాడు