రాయ్‌పూర్: క్రిస్మస్ నేపథ్యంలో ఒక షాపింగ్ మాల్లో ఆ థీమ్‌తో డెకరేషన్ చేశారు. కొందరు వ్యక్తులు ఆ మాల్‌లోకి చొరబడ్డారు. క్రిస్మస్ డెకరేషన్‌ను ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Christmas Decorations Vandalised) ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 24న మాగ్నెటో మాల్లో క్రిస్మస్ థీమ్‌తో అలంకరణ చేశారు. అయితే 80 మందికిపైగా వ్యక్తులు ఆ మాల్‌లోకి ప్రవేశించారు. క్రిస్మస్ డెకరేషన్‌ను కర్రలతో ధ్వంసం చేశారు. మాల్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా, అక్రమ మతమార్పిడులను నిరసిస్తూ హిందూ సంఘాలు బుధవారం ‘ఛత్తీస్‌గఢ్ బంద్’కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మాల్లోని క్రిస్మస్ డెకరేషన్‌ను ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Raipur Magneto mall Christmas decoration vandalised by extremist. #MerryChristmas #Christmas pic.twitter.com/NhV0DSX9tx
— Believer (@PredatorVolk) December 24, 2025
Also Read:
Toxic Syrup Survivor | మృత్యువును జయించిన దగ్గు మందు బాధిత బాలుడు.. కంటిచూపు కోల్పాయాడు
Drug-Addict Man Crosses Border | డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి సరిహద్దు దాటాడు .. పాక్‌లో అరెస్టయ్యాడు