లక్నో: రాత్రి వేళ వాక్ చేస్తున్న ఉపాధ్యాయుడ్ని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. దీనికి ముందు ‘నేను ఎవరో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు’ అని ఒక వ్యక్తి ఆయనతో అన్నాడు. ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ కాల్పుల సంఘటన జరుగడం కలకలం రేపింది. (Aligarh Teacher Shot Dead) ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఏబీకే హైస్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్‌గా డానిష్ రావు 11 ఏళ్లుగా పని చేస్తున్నారు.
కాగా, డిసెంబర్ 24న రాత్రి 8.50 గంటల సమయంలో భోజనం తర్వాత ఇద్దరు సహోద్యోగులతో కలిసి డానిష్ రావు వాకింగ్‌కు వెళ్లారు. యూనివర్సిటీలోని లైబ్రరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వారి వద్దకు చేరుకున్నారు. పిస్టల్స్‌తో బెదిరించారు. డానిష్ రావుపై మూడుసార్లు కాల్పులు జరిపారు. తలపై రెండు రౌండ్లు కాల్చారు. ‘నా గురించి ఇంకా నీకు తెలియదా? ఇప్పుడు నీకు తెలుస్తుంది’ అని కాల్పులు జరిపే ముందు ఒక వ్యక్తి ఆ టీచర్‌తో అన్నాడు.
మరోవైపు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డానిష్‌ను జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌కు చేరుకున్నారు. టీచర్‌ను కాల్చి చంపిన నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Drug-Addict Man Crosses Border | డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి సరిహద్దు దాటాడు .. పాక్‌లో అరెస్టయ్యాడు
Toxic Syrup Survivor | మృత్యువును జయించిన దగ్గు మందు బాధిత బాలుడు.. కంటిచూపు కోల్పాయాడు
Watch: రైలులో కాలేజీ అమ్మాయి పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తర్వాత ఏం జరిగిందంటే?