సిద్దిపేట, మార్చి 16: సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురసా రం వరించింది. ‘కరోనా‘ సమయంలో రచిం చిన అనిమేష దీర్ఘకవితా సంపుటికి వచన కవిత్వం విభాగంలో అవార్డు లభించింది. డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య పురస్కారం లభించడంపై పలువురు సాహిత్యవేత్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
నందిని సిధారెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం. 1955 డిసెంబర్ 6న ఆయన జన్మించారు. తండ్రి బాల సిధారెడ్డి, తల్లి రత్నమాల, భార్య మల్లేశ్వరి, కూతురు వీక్షణ. ప్రాథమిక విద్య బందారం, వెలటూరు, దుద్దెడ, ఉన్నత విద్య సిద్దిపేటలో పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సి టీలో ఎంఏ తెలుగు, ఆధునిక తెలు గు కవిత్వంలో సూర్యు డు అనే అంశంపై 1981లో ఎంఫిల్ చేశారు. ‘ఆధునిక కవిత్వం-వాస్తవికత-ఆదివాస్తవికత’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. మెదక్, సిద్దిపేట డిగ్రీ కళాశాలల్లో తెలుగు లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా కొంతకాలం పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యేందుకు ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్లీ లెక్చరర్‌గా బాధ్యతలు చేపట్టి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
నందిని సిధారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. 2001లో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను స్థాపించి, ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఇద్దరు కలిసి చదువుకున్న స్నేహం నేపథ్యంలో కేసీఆర్ ప్రారం భించిన ఉద్యమానికి నందిని సిధారెడ్డి మద్దతిచ్చారు. తెలంగాణ కోసం 1997లోనే పాటలు రాశారు. అందులో భాగంగా రాసిందే ‘ నాగేటి సాల్లల్ల నా తెలంగాణ‘ పాట తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత ప్రభావితం చేసింది. ఇంకా అనేక పాటలు రాశారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని రచయితలు, కవులు, కళాకారులను ఒక వేదిక మీదికి తీసుకొచ్చే సంకల్పంతో తెలంగాణ రచయితల వేదిక ప్రారం భించడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణే ధ్యేయంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నందిని సిధారెడ్డి సాహిత్య కృషిని గుర్తించి ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగిం చింది. చైర్మన్‌గా ఆయన సమర్థవంతంగా పనిచేశారు. అనేక పుస్తకాలు ప్రచురించారు. కేసీఆర్ సారథ్యంలో నందిని సిధారెడ్డి నేతృత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం నందిని సిధారెడ్డికి రూ.కోటి నగ దు బహుమతి, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపం మార్చడం, అధికారిక ముద్రలో తెలంగాణ చిహ్నాలు తొలిగించడం వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఇచ్చే నగదు పురసారాన్ని నందిని సిధా రెడ్డి తిరసరించి తన నిబద్ధతను చాటుకున్నారు.
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురసారం లభించడంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. నందిని సిధారెడ్డికి అభినందనలు తెలిపారు. మంజీరా రచయితల సంఘం హర్షం ప్రకటించింది.