చండీగఢ్: డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి సరిహద్దు దాటాడు. పాకిస్థాన్ రేంజర్లు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడి విడుదలకు సహాయం చేయాలని అతడి కుటుంబం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. (Drug-Addict Man Crosses Border) పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భోయ్‌పూర్ గ్రామానికి చెందిన శరణ్‌జిత్ సింగ్ పదేళ్లుగా రెజ్లర్‌గా ఉన్నాడు. అయితే 2024 నుంచి మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు, ఇతరులతో తరచుగా గొడవ పడేవాడు.
కాగా, నవంబర్ 2న సాయంత్రం వేళ శరణ్‌జిత్ సింగ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే పాకిస్థాన్ సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేమ్కరన్ వద్ద ఫ్రెండ్ మన్దీప్ అతడ్ని వదిలి వెళ్ళాడు. శరణ్‌జిత్ ఇంటికి తిరిగి రావకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్నేహితుడు మన్‌దీప్‌ను ఆరా తీయగా చాలా రోజులు అతడు అబద్ధం చెప్పాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 7న మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శరణ్‌జిత్ గురించి పాకిస్థాన్‌ను సమాచారం కోరింది. అతడు సరిహద్దు దాటడంతో పాక్ రేంజర్లు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. నవంబర్ 21న శరణ్‌జిత్ చేతికి సంకెళ్లు వేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది తెలుసుకుని అతడి కుటుంబం షాక్ అయ్యింది. తమ కుమారుడ్ని విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఒక ఘర్షణకు సంబంధించి శరణ్జిత్పై తొలి కేసు నమోదైనట్లు పోలీస్ అధికారి తెలిపారు. అరెస్టైన అతడు అక్టోబర్ 17న జైలు నుంచి విడుదలైనట్లు వెల్లడించారు.
Also Read:
Toxic Syrup Survivor | మృత్యువును జయించిన దగ్గు మందు బాధిత బాలుడు.. కంటిచూపు కోల్పాయాడు
Watch: రైలులో కాలేజీ అమ్మాయి పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తర్వాత ఏం జరిగిందంటే?