న్యూఢిల్లీ: భారత్ మరో కీలక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న కే-4 క్షిపణిని జలాంతర్గామి నుంచి ప్రయోగించింది. సుమారు 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే న్యూక్లియర్ మిస్సైల్‌ను న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుంచి పరీక్షించారు. (India tests K-4 missile) ఐఎన్ఎస్ అరిఘాట్ జలాంతర్గామి నుంచి కే-4 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి ఈ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ వర్గాలు మీడియాకు తెలిపాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
కాగా, గత ఏడాది ఐఎన్ఎస్ అరిఘాట్ జలాంతర్గామి నుంచి తొలిసారి కే-4 క్షిపణిని పరీక్షించారు. తాజాగా రెండోసారి ఈ మిస్సైల్ టెస్ట్ నిర్వహించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కే-4 క్షిపణిని అభివృద్ధి చేసింది. అణుశక్తితో నడిచే జలాంతర్గాముల్లో మోహరించేందుకు ఈ క్షిపణులను పరీక్షిస్తున్నారు.
Also Read:
Toxic Syrup Survivor | మృత్యువును జయించిన దగ్గు మందు బాధిత బాలుడు.. కంటిచూపు కోల్పాయాడు
Drug-Addict Man Crosses Border | డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి సరిహద్దు దాటాడు .. పాక్‌లో అరెస్టయ్యాడు
Christmas Decorations Vandalised | షాపింగ్ మాల్లో క్రిస్మస్ డెకరేషన్.. ధ్వంసం చేసిన దుండగులు