సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:05:41

తికమక టెస్టులు

తికమక టెస్టులు

  • యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్
  • ‌ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌

ముంబై, జూలై 26: కరోనా టెస్టుల్లో చిత్రవిచిత్రాలు యటపడుతున్నాయి. ముఖ్యంగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చిన వ్యక్తికి ఆర్టీ-పీసీఆర్‌ టెస్టు చేస్తే పాజిటివ్‌ వస్తున్నది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో ఈ గందరగోళం అధికంగా ఉన్నది. ముంబైలోని రెండు కీలక ల్యాబుల్లో పరీక్షల డాటాను విశ్లేషించిన అధికారులు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినవారిలో ఏకంగా 65శాతం మందికి ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల్లో వ్యాధి ఉన్నట్టు తేలింది. ఢిల్లీలో జూన్‌ 18 నుంచి జూలై 21 వరకు 3.6లక్షల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయగా ఆరుశాతం పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. వారిలో కరోనా లక్షణాలున్న 2,294 మంది నమూనాలపై ఆర్టీ- పీసీఆర్‌ టెస్టులు చేయగా ఏకంగా 15శాతం పాజిటివ్‌ కేసులు తేలాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 


logo