MPs suspended | శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్లు (MPs suspended) కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ ఎంపీలు (Congress MPs) దీపక్ బైజ్, నకుల్ నాథ్, డీకే సురేశ్‌లను లోక్‌సభ (Lok Sabha) నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఎగువ, దిగువ సభల నుంచి సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది. ఈ శీతాకాల సెషన్ మొత్తానికి వారిని సస్పెండ్ చేశారు. పార్లమెంట్ చరిత్రలో ఒక సెషన్లో ఇంతమందిపై వేటువేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Three more Congress MPs including DK Suresh, Nakul Nath and Deepak Baij suspended from the Lok Sabha.
— ANI (@ANI) December 21, 2023
కాగా, డిసెంబర్ 13న లోక్‌సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంట్‌ను (Parliament security breach) కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్ కొరడా ఝళిపిస్తున్నది. వరుసగా ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నది. ఈ క్రమంలో ఎగువ, దిగువ సభల నుంచి ఇప్పటి వరకూ మొత్తం 146 (తాజా సస్పెన్షన్‌తో కలిపి) మంది ఎంపీలను సస్పెండ్ చేసింది.
ఈ నెల 14న 14 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సోమవారం మరో 78 మంది, మంగళవారం 49 మంది, బుధవారం ఇద్దరు ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇవాళ ముగ్గురు ఎంపీలు స్పెండ్ అయ్యారు.
Also Read..
Opposition MPs | సస్పెన్షన్‌పై ప్రతిపక్ష ఎంపీల నిరసన ప్రదర్శన
Parliament Security: సీఐఎస్ఎఫ్ చేతుల్లోకి పార్లమెంట్ భద్రత
Coronavirus | కలవరపెడుతున్న కొత్త వేరియంట్.. జేఎన్.1 లక్షణాలు ఇవీ