Jio Down : దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ డౌన్ (Jio network down) అయ్యింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మొబైల్ ఇంటర్నెట్ (Mobile internet), ఫోన్ కాల్ (Phone call), జియోఫైబర్ (JioFiber) సర్వీసులలో సమస్యలు తలెత్తాయి. దాంతో యూజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు కేవలం 400 ఫిర్యాదులు అందగా.. ఆ తర్వాత గంటసేపట్లో అంటే 2.45 కల్లా ఫిర్యాదుల సంఖ్య 12 వేలు దాటింది.
నెట్వర్క్ ఔటేజ్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్ డిటెక్టర్ ప్రకారం.. 56 శాతం మంది జియో యూజర్స్ మొబైల్ ఇంటర్నెట్ సమస్యను, 32 శాతం మంది ఫోన్ కాల్స్ సమస్యను, 12 శాతం మంది జియోఫైబర్ నెట్వర్క్ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ సమస్యలపై ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్ల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ ఔటేజ్కు కారణం ఏందనే దానిపై జియో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.