Heavy traffic : సాధారణంగా ట్రాఫిక్ జామ్ (Traffic Zam) వాహనదారులను చికాకుపెడుతుంది. ఇక గంటల తరబడి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతే ఆ బాధ చెప్పనలవి కాదు. సోమవారం ఉదయం మహారాష్ట్ర (Maharastra) లో అలాంటి ట్రాఫిక్ జామే అయ్యింది. ముంబై-థానే (Mumbai-Thane) రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై కూడా పలుచోట్ల వరదనీరు నిలిచిపోయింది. ముంబై-థానే రహదారిపై కూడా నీరు నిలవడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
#WATCH | Maharashtra | Long queue of vehicles on Mumbai-Thane road at Anand Nagar, Thane, as the area continues to receive rainfall since last night pic.twitter.com/EIhDX3wKTv
— ANI (@ANI) June 16, 2025