Vijay Rupani : అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని రాజ్‌కోట్ (Rajkot) కు తీసుకొచ్చారు. విజయ్ రూపానీ సతీమణి అంజలి రూపానీ, కుమారుడు రుషబ్ రూపానీ ఇవాళ ఉదయం అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి మార్చురీ నుంచి రూపానీ పార్థివదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌లో రాజ్‌కోట్‌కు వచ్చారు.
ఇవాళ సాయంత్రం రాజ్‌కోట్‌లో విజయ్ రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రూపానీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మరణించారు. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన తర్వాత సెకన్లలోనే కుప్పకూలింది.
దాంతో ఆ విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డాడు. ఇక విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడటంతో ఆ హాస్టల్లో ఉన్న వైద్యులు, సిబ్బందిలో కూడా 38 మంది మరణించారు. వారిలో 24 మంది ఘటన జరిగినప్పుడే మరణించగా.. గాయాలతో చికిత్స పొందుతూ మూడు రోజుల్లో మరో 14 మంది మృతిచెందారు. మరికొందరు క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది.
#WATCH | Rajkot | Mortal remains of former Gujarat CM Vijay Rupani brought to Rajkot, where his last rites will be performed at 5 pm with state honours. pic.twitter.com/PhXu2TWXxh
— ANI (@ANI) June 16, 2025