Bike taxi | కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలు బంద్.. ఎందుకంటే..!
Bike taxi | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ (Bike taxi) సేవలు బంద్ అయ్యాయి. ఇటీవల కర్ణాటక హైకోర్టు (Karnataka High court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలను నిలిపివేశాయి.
Bike taxi : కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ (Bike taxi) సేవలు బంద్ అయ్యాయి. ఇటీవల కర్ణాటక హైకోర్టు (Karnataka High court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలను నిలిపివేశాయి. హైకోర్టు ఆదేశానుసారం తాము బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేశామని ర్యాపిడో పేర్కొంది. అయితే సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.
ఉబర్ బైక్ ట్యాక్సీ సేవలను మోటో కొరియర్ కింద మార్చగా, ఓలా తన యాప్‌లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్‌ను పూర్తిగా తొలగించింది. కాగా మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీ అనే ప్రస్తావన లేకపోవడంతో ఆ సేవలను నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. బైక్ ట్యాక్సీ కంపెనీలు ఈ ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది.
సోమవారం నుంచి బైక్ ట్యాక్సీ సేవలు నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో జూన్ 20 లోగా ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. బైక్ ట్యాక్సీలపై నిషేధం వల్ల గిగ్‌వర్కర్ల జీవితాలు రోడ్డునపడతాయంటూ ‘నమ్మ బైక్ ట్యాక్సీ అసోసియేషన్’.. సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖలు రాసింది. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరింది.
Read More >>
రాజ్‌కోట్‌కు విజయ్ రూపానీ పార్థివదేహం.. Video
‘మమ్మల్ని తీసుకెళ్లండి’.. ఇరాన్లో భయం గుప్పిట్లో భారత విద్యార్థులు
మాపై అణు బాంబులు వేస్తే ఇజ్రాయెల్‌పై పాక్ ప్రతిదాడి చేస్తుంది : ఇరాన్
అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు.. Video
కండక్టర్ లేకుండానే బయల్దేరిన బస్సు.. ప్రయాణికులు చెప్పడంతో తిరిగి బస్టాండ్‌కు తీసుకెళ్లిన డ్రైవర్!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

