మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 13:59:04

వాళ్ల‌ను అండ‌మాన్ జైల్లో ప‌డేయాలి!

వాళ్ల‌ను అండ‌మాన్ జైల్లో ప‌డేయాలి!

ముంబై: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును త‌ప్పుప‌డుతూ పీపుల్స్ డెమొక్ర‌టిక్ పార్టీ (పీడీపీ) అధ్య‌క్షురాలు మెహ‌బూబా ముఫ్తీ, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్య‌క్షుడు ఫ‌రూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ తీవ్రంగా స్పందించారు. భార‌త రాజ్యాంగాన్ని ఎదిరించేవాళ్ల‌ను అస్స‌లు క్షమించ‌కూడ‌ద‌న్నారు. మ‌హ‌బూబా ముఫ్తీగానీ, ఫ‌రూఖ్ అబ్దుల్లాగానీ, మ‌రొక‌రుగానీ చైనా సాయంతో భార‌త రాజ్యాంగాన్ని ఎదిరించే ప్ర‌య‌త్నం చేస్తే.. వారిని తీసుకెళ్లి ప‌దేండ్ల‌పాటు అండ‌మాన్ జైల్లో ప‌డేయాల‌ని వ్యాఖ్యానించారు. 

ఇటీవ‌ల ఫ‌రూక్ అబ్దుల్లా, మెహ‌బూబా ముఫ్తీలు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు నిర‌స‌న‌గా తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ర‌ద్దు చేసిన ఆర్టిక‌ల్‌ను పున‌రుద్ధ‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఫ‌రూక్ అబ్దుల్లా ఒక అడుగు ముందుకేసి ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ధ‌ర‌ణ కోసం అవ‌స‌ర‌మైతే చైనా సాయం తీసుకుంటామ‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వారి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ సంజ‌య్ రౌత్ పైవిధంగా స్పందించారు. ( చూడండి..మోతాదు మించితే విషమే.. వీడియో )

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.