అమెరికా తిరస్కరించిన మందును ఓకే చేసిన గోవా

న్యూఢిల్లీ: కోవిడ్ రోగుల చికిత్సకు ఇవర్మెక్టిన్ ఉపయోగించేందుకు గోవా ప్రబుత్వం అనుమతించింది. అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్డీఏ) ఈ మందును తిరస్కరించింది. ఇవర్మెక్టిన్ పూర్తిగా ఇన్ఫెక్షన్ను తొలగించదని, అయితే జబ్బు తీవ్రతను అది తగ్గిస్తుందని గోవా ప్రజారోగ్య శాఖామంత్రి విశ్వజిత్ పీ రాణే ఫేస్బుక్ పోస్టులో తెలిపారు. రోగికి ఐదు రోజులపాటు ప్రతిరోజూ 12 మి.గ్రా. మందును ఇస్తారని ఆయన వివరించారు. మరణాల రేటును, కోలుకునే సమయాన్ని తగ్గించడం, వైరస్ను లేకుండా చేయడం ఇవర్మెక్టిన్ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలని, యూకే, ఇటలీ, స్పెయిన్, జపాన్ నిపుణుల బృందాలు తేల్చిచెప్పాయని రాణే పేర్కొన్నారు. అయితే ఈ మందుతో ఏదో ఙభరోసా లభించినట్టు భావించరాదని, దీంతోపాటే మిగతా చికిత్సలూ కొనసాగించాలని, స్పష్టం చేశారు. అన్ని స్థాయిల ఆస్పత్రులకు ఈ మందు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. లక్షణాలున్నా, లేకున్నా ఈ మందు వాడాలని సూచించారు. గోవాలో సోమవారం కొత్త కరోనా కేసులు 2,804 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,650కి చేరుకుంది. అలాగే 50 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 1,729కు పెరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

