న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. కరోనా మహమ్మారి ఏడాది కాలంగా కొనసాగుతున్న పోరాటం గురించి ప్రస్తావించారు.
దేశంలో బృహత్తరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని, కురువృద్ధులు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. హైదరాబాద్లో జయ్ చౌదరీ అనే వందేండ్ల వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడని, యూపీలో 109 ఏండ్ల రామ్ దులయ్యా, ఢిల్లీలో 107 ఏండ్ల కేవల్ కృష్ణ కరోనా కరోనా టీకా వేయించుకున్నారని ప్రధాని చెప్పారు.
The world's biggest vaccination program is underway in India, today. In UP's Jaunpur, a 109-yr-old woman got herself vaccinated. Similarly, a 107-yr-old man in Delhi got himself vaccinated. We have to make people committed towards the mantra of 'Dawai bhi, Kadai bhi': PM Modi pic.twitter.com/n8EhqNrnZA
— ANI (@ANI) March 28, 2021
కాబట్టి ప్రజలు వ్యాక్సిన్ గురించి ఎలాంటి అపోహలను పెట్టుకోవద్దని, అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. గత ఏడాది మార్చిలో జనతా కర్ఫ్యూ అనే పదాన్ని కొత్తగా విన్నామని, దేశంలో పాటించిన ఆ జనతా కర్ఫ్యూ ప్రపంచానికే మార్గదర్శనం చేసిందని చెప్పారు. దేశంలో అసాధారణమైన క్రమశిక్షణకు అది నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు