Delimitation | లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై (Delimitation) చర్చించేందుకు తమిళనాడు (Tamil Nadu)లోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) అధ్యక్షతన చెన్నైలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏడు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం హాజరైంది.
#WATCH | Chennai: Tamil Nadu CM MK Stalin felicitates CMs of states as well as leaders from various parties who are attending the meeting on delimitation.
(Video Source: Tamil Nadu DIPR) pic.twitter.com/WzBReRxKaK
— ANI (@ANI) March 22, 2025
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ ప్రత్యేకంగా ప్రసంగించి డీలిమిటేషన్ వల్ల కలిగే నష్టాలను వివరించనున్నారు. చెన్నై సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకుని, భవిష్యత్తులో ఒక కూటమిగా నిలిచి ఈ అన్యాయాన్ని సమిష్టిగా ఎదుర్కోనున్నాయి. ఈ సమావేశం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఐక్యత మరింత బలపడుతుందని, భవిష్యత్ రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన మలుపు కావొచ్చని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
చెన్నై సమావేశం ద్వారా ఈ అంశంపై మరింత స్పష్టత రానుందని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేస్తాయని బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తోపాటు రాజ్యసభలో పార్టీ పక్ష నేత కేఆర్ సురేశ్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు హాజరుకానున్నారు. అంతేకాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
#WATCH | Chennai: Tamil Nadu CM MK Stalin felicitates CMs of states as well as leaders from various parties who are attending the meeting on delimitation.
(Video Source: Tamil Nadu DIPR) pic.twitter.com/LuTZN57zQy
— ANI (@ANI) March 22, 2025
Also Read..
KTR | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయమే.. ఇకనైనా స్పందించకుంటే చరిత్ర క్షమించదు: కేటీఆర్
“డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు”