Road Accident | ముంబై : మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాడిగోద్రి – జల్నా మార్గంలోని షాహపూర్ ఏరియా వద్ద మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు.. బస్సు అద్దాలను పగులగొట్టి, చాలా మందిని బయటకు లాగి ప్రాణాలతో రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బస్సు జెవారి నుంచి జల్నా వెళ్తుండగా ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్రక్కులో ఆరెంజ్ పండ్లను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
iPhone 16 | ఎన్ని రోజులు పనిచేస్తే.. మీరు ఐఫోన్ 16 కొనగలరో తెలుసా..
Amit Shah: ఆయుధాలు వీడండి.. లేదంటే.. నక్సల్స్‌కు అమిత్ షా వార్నింగ్
Mamata Banerjee | దీదీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బెంగాల్ – జార్ఖండ్ సరిహద్దులు మూసివేత