Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (Damodar Valley Corporation) కారణమని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ (Jharkhand) సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులను దీదీ ఆదేశించారు.
గురువారం పూర్వ మిడ్నాపూర్, హౌరా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్ని మమతా బెనర్జీ సందర్శించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు.
‘ఇది వర్షం నీరు కాదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డీవీసీ డ్యాముల నుంచి విడుదలైన నీరు ఇది. డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యం 36 శాతం తగ్గింది. ఇందుకు కారణం కేంద్రం నిర్లక్ష్యమే. ఇదొక పెద్ద కుట్ర. దీన్ని అడ్డుకుంటాం’ అని మమతా అన్నారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు.
Also Read..
iPhone 16 | భారత్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల అమ్మకాలు.. వాటి విశేషాలు మీకోసం
Tirumala | గత ఐదేళ్లు మహాపాపం జరిగిపోయింది.. తిరుమల లడ్డూ వివాదంపై రమణ దీక్షితులు ఆవేదన
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్