iPhone 16 | ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇటీవలే విడుదలైన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయాలు భారత్‌లో మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఈ ఫోన్లు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఐఫోన్ ప్రియులు ఎగబడ్డారు. తెల్లవారకముందే ఆపిల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. ముంబై, ఢిల్లీతో సహా పలు ఆపిల్ స్టోర్ల బయట కొనుగోలుదారులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విశేషాలను మీ కోసం..
#WATCH | Maharashtra: Apple begins its iPhone 16 series sale in India; a large number of people throng the company’s store in Mumbai’s BKC pic.twitter.com/Yvv9CGyXoA
— ANI (@ANI) September 20, 2024
తన తదుపరి మోడల్ ఐఫోన్ 16ను (iPhone 16) యాపిల్ (Apple) సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఇట్స్ గ్లోటైమ్’ పేరుతో ఈనెల 9 న నిర్వహించిన ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్ఫాడ్స్ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ ప్రొ 2లను కూడా సంస్థ లాంచ్ చేసింది. కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఈవో టిమ్ కుక్ ఈ ఉత్పత్తులను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వాటి విశేషాలను పంచుకున్నారు.
#WATCH | Mumbai: People purchase Apple’s iPhone as the company began its iPhone 16 series sale in India today
A customer Akshay says, “I came at 6 am. I purchased the iPhone 16 Pro Max. I liked iOS 18 and the zoom camera quality has become better now, I came from Surat.” https://t.co/KZsTgu6wyp pic.twitter.com/93vqlgolQk
— ANI (@ANI) September 20, 2024
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధర, ఇతర వివరాలు..
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొమ్యాక్స్ అనే నాలుగు మోడళ్లను యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్ ఫోన్లు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో వీటిని మరింత శక్తిమంతంగా రూపొందించింది. అధునాతన కెమెరా కంట్రోల్ పీఛరుతో పాటు కొత్త బటన్లు కూడా ఉన్నాయి. కొత్త సిరీస్ ఫోన్లలో ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18ను అమర్చారు. ఈ కొత్త 16 సిరీస్ ఫోన్లను ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో రూపొందించారు. గ్లాస్ బ్యాక్ ఫోన్లతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం.
ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర వివరాలు..
128 స్టోరేజీతో కూడిన ఐఫోన్ 16 బేస్ డిస్ప్లే 6.1 అంగుళాల పొడవు.
వెనిలా వేరియంట్‌తో దీన్ని రూపొందించారు.
ఐవోఎస్ 18తో ఇది పనిచేస్తుంది.
2000 నిట్స్ వరకు బ్రైట్నెస్ను పెంచుకోవచ్చు.
ఇక మోడల్ ఫోన్ ధర రూ.79,900 నుంచి ప్రారంభ అవుతుంది.
ఐఫోన్ 16 ప్లస్
128 స్టోరేజీతో కూడిన ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900తో ప్రారంభం కానుంది.
ఈ ఫోన్ డిస్ప్లే 6.7 అంగుళాల పొడవుతో ఇచ్చారు.
ఇందులో సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.
వెనుక వైపు 48 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా అమర్చారు.
12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది.
ముందువైపు సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరా అమర్చారు.
అదేవిధంగా కెమెరా కంట్రోల్ బటన్‌తో చాలా ఈజీగా ఫొటోలూ, వీడియోలు తీసుకోవచ్చు.
ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీలలో అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటాయి.
ఇక ఐఫోన్ 16 ప్రొ, ప్రొమ్యాక్స్ ఫోన్ల విషయానికొస్తే..
ప్రొ డిస్ప్లే 6.3 అంగుళాలు, 16 ప్రొమ్యాక్స్ 6.9 అంగుళాలతో ఉంటుంది.
ఈ రెండు మోడళ్లలో అడ్వాన్స్డ్ కూలింగ్ ఛాంబర్ ఫీచర్ ఉందని సంస్థ ప్రకటించింది.
ఈ ప్రొ మోడళ్లలో 4k120 క్వాలిటీతో వీడియోలు రికార్డు చేయొచ్చు.
128 జీబీ స్టోరేజీ గల బేస్ మోడల్ 16 ప్రొ ధర రూ.1,19,900
256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చే 16 ప్రొమ్యాక్స్ ధర రూ.1,44,900తో ప్రారంభం కానుంది.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం రంగులలో అందుబాటులో ఉంటాయి. అలాగే 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంటాయి.
Also Read..
Pawan Kalyan | ఆ సమయం ఆసన్నమైంది.. తిరుమల లడ్డూ వివాదంపై మండిపడ్డ పవన్ కల్యాణ్
Cyber Crime: పెను సవాల్‌గా మారుతున్న సైబర్ క్రైం : కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్
Apple – iPhone 16 | ఐ-ఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం.. తెల్లవారుజాము నుంచే ఆపిల్ స్టోర్ల ముందు క్యూ