Pawan Kalyan | తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతోంది. లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల నూనెలను వాడారని వచ్చిన నివేదికలు భక్తుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. పవిత్రమైన తిరుపతి శ్రీవారి లడ్డూను కల్తీ చేయడంతో మహా పాపానికి పాల్పడిన నీచులను శిక్షించాలని ఓ భక్తుడు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఫిర్యాదు చేశాడు. దీనికి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
వైసీపీ హయాంలో లడ్డూ తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ (ఎన్డీడీబీజీ) సీఏఎల్ఎఫ్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఈ ఏడాది జూలైలో లడ్డూను ల్యాబ్‌కు పంపగా, అదే నెల 17న నివేదిక వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. లడ్డూలో ఆవు నెయ్యి, సో యాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మకజొన్న, పత్తి గింజలతోపాటు చేపనూనె, జం తుకొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఆ రిపోర్టును గురువారం టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు