హైదరాబాద్: సైబర్ క్రైమ్(Cyber Crime) పెను సవాల్‌గా మారిందని కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 76వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐపీఎస్ ట్రైనీలు సాంకేతిక అంశాల్లో నిపుణత సాధించాలని పేర్కొన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌తో పాటు ఇతర అనేక సైబర్ సంబంధిత కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ అకాడమీలో 207 మంది ఆఫీసర్ ట్రైనీలు శిక్షణ తీసుకున్నారు. దీంట్లో 188 మంది ఐపీస్ ఆఫీసర్లు, 19 మంది విదేశీ ఆఫీసర్లు ఉన్నారు. నేపాల్, భూటాన్‌తో పాటు ఇతర దేశాల వారు కూడా శిక్షణ పొందారు. ఐపీఎస్ అకాడమీలో శిక్షణ పొందిన వారిలో 58 మంది లేడీ ఆఫీసర్లు ఉన్నారు.
#WATCH | Hyderabad, Telangana: Minister of State for Home Nityanand Rai says, “The country is celebrating the Amrit Mahotsav of Independence, now we are all waiting for the centenary of our independence. In this century, more emphasis should be given to duties than rights. The… pic.twitter.com/IsekOcVC1k
— ANI (@ANI) September 20, 2024