Apple – iPhone 16 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఏఐ సాంకేతిక తరహాలో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆపిల్ స్టోర్ల ముందు బారులు తీరారు. ముంబై, ఢిల్లీతో సహా పలు ఆపిల్ స్టోర్ల బయట కొనుగోలుదారులు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదే విధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఇదిలా ఉండగా.. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా ఉన్నాయి.
ఈ ఫోన్లు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లిష్ వర్షన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చేనెలలో అందిస్తుంది.
ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం
ఇండియాలో ఈరోజు నుండే ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభం
ఉదయం నుండే స్టోర్ల దగ్గర లైన్ కట్టి మరీ ఎగబడి కొంటున్న జనం. pic.twitter.com/IACISF9vM7
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2024
ఇవి కూడా చదవండి..
RRR Survey | దొంగ రాత్రి వేళ పల్లెల మీద డ్రోన్ల సర్వే..! రైతులకు తెలియకుండా పొలాల్లో హద్దురాళ్లు..!!
RRR | ఆమనగల్లుకు 300 ఫీట్ల రోడ్డు..? భారీ రియల్ఎస్టేట్ ప్రయోజనాలు దాగి ఉన్నాయా..?
RRR | ఈ ఊరు మాయమైతున్నది..! గుడితండా గుండెపై ట్రిపుల్ ఆర్ పిడుగు..!!