Air India | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (bomb threat) కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఏకంగా ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా (Air India)తోపాటు పలు కంపెనీలకు చెందిన విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ఢిల్లీ – చికాగో, జైపూర్-బెంగళూరు, స్పైస్‌జెట్‌కు చెందిన దర్భంగా-ముంబయి, ఆకాసా ఎయిర్‌లైన్‌కు చెందిన సిలిగురి-బెంగళూరు విమానానికి, ఇండిగోకు చెందిన డమ్మామ్ నుంచి లక్నో ఫ్లైట్, అలయన్స్ ఎయిర్ లైన్‌కు చెందిన అమృత్సర్, డెహ్రాడూన్ – ఢిల్లీ ఫ్లైట్స్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి.
మధురై నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) ఫ్లైట్ 684కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. ఫ్లైట్ సింగపూర్‌కు బయల్దేరిన వెంటనే అందులో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సింగపూర్ ప్రభుత్వం.. ఫైటర్ జెట్లను (fighter jets) రంగంలోకి దింపింది. ఆ విమానం చాంగీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి ముందు జనావాసాల నుంచి దూరంగా మళ్లించేందుకు సింగపూర్ భద్రతా దళాలకు చెందిన రెండు F-15SG ఫ్లైట్లు ఎయిర్ ఇండియా విమానానికి ఎస్కార్ట్ (escort)గా వ్యవహరించాయి.
ఎయిర్ ఇండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్జీ ఎంగ్ హెన్ స్పందించారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్జీలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. మరోవైపు బాంబు బెదిరింపు నేపథ్యంలో సింగపూర్ అధికారులు గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్‌ను యాక్టివేట్ చేసినట్లు చెప్పారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఈ బెదిరింపుల ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
(1/3) Air India Express received an email that there was a bomb on board flight AXB684 that was bound for Singapore. Two of our RSAF F-15SGs scrambled and escorted the plane away from populated areas, to finally land safely at Singapore Changi Airport at around 10:04pm tonight. pic.twitter.com/tOzo6wgT5E
— Ng Eng Hen (@Ng_Eng_Hen) October 15, 2024
Also Read..
Canada | ఆగని కెనడా కవ్వింపులు.. భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్న ప్రధాని జస్టిన్ ట్రూడో
సరిహద్దు రోడ్లను పేల్చేసిన ఉత్తరకొరియా
Lunar Space Station: లూనార్ రీసర్చ్ స్పేస్ స్టేషన్ నిర్మించనున్న చైనా