సియోల్, అక్టోబర్ 15: ఉత్తర కొరియా అన్నంత పని చేసింది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను పేల్చేసింది. దక్షిణ కొరియా సైన్యం మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఉత్తర కొరియా చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర కొరియా చర్యకు ప్రతిస్పందనగా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపింది. తమ దేశ రాజధానిపైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతున్నదని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.