బీజింగ్: లూనార్ రీసర్చ్ స్పేస్ స్టేషన్‌ను(Lunar Space Station) నిర్మించేందుకు చైనా ప్రణాళిక వేసింది. మానవులతో కూడిన లూనార్ మిషన్‌ను చేపట్టేందుకు కూడా డ్రాగన్ దేశం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. విశ్వాంతరాల్లో నివాసయోగ్యమైన గ్రహాన్వేషణ కూడా చైనా చేపట్టనున్నది. రాబోయే కొన్ని దశాబ్ధాల్లో ఈ ప్రాజెక్టులకు చైనా రూపకల్పన చేస్తోంది. చైనాకు చెందిన అంతరిక్ష విభాగం స్పేస్ స్టేషన్ నిర్మాణానికి చెందిన వివరాలను వెల్లడించింది. 2024 నుంచి 2050 వరకు అంతరిక్ష పరిశోధన చేపట్టనున్నట్లు చెప్పింది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ఆ ప్లాన్‌కు చెందిన ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ లూనార్ రీసర్చ్ స్టేషన్‌ను 2028 నుంచి 2035 మధ్య కాలంలో నిర్మించనున్నారు.