Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఢిల్లీలోని రాజ్‌ఘాట్ (Rajghat)ను సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ (Mahatma Gandhi ) సమాధి వద్ద నివాళులర్పించారు. పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అంతకు ముందు రాజ్ భవన్‌కు చేరుకున్న పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు పుతిన్.
#WATCH | Delhi | Russian President Vladimir Putin lays a wreath at the Rajghat and pays tribute to Mahatma Gandhi.
(Video: DD) pic.twitter.com/BsAyDTlKRr
— ANI (@ANI) December 5, 2025
వ్లాదిమిర్ పుతిన్ పదోసారి ఇండియాకు వచ్చారు. గురువారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యేక విందులో పాల్గొన్నారు. 7 లోక్ కళ్యాన్ మార్గ్ నివాసంలో పుతిన్‌కు మోదీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన ఫ్రెండ్ పుతిన్‌కు భగవద్గీత గ్రంధాన్ని మోదీ (PM Modi) బహూకరించారు. రష్యన్ భాషలో తర్జుమా చేసిన గీతా పుస్తకాన్ని పుతిన్‌కు అందజేశారు. ఇవాళ పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు చర్చలు నిర్వహించనున్నారు.
Delhi | Russian President Vladimir Putin signed the visitors’ book at the Rajghat, where he paid tribute to Mahatma Gandhi. pic.twitter.com/1Eku1nN4Ua
— ANI (@ANI) December 5, 2025
Also Read..
PM Modi: భగవద్గీతను పుతిన్‌కు బహూకరించిన మోదీ
IndiGo | వరుసగా నాలుగోరోజూ.. 400కిపైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. ప్రయాణికులకు తప్పని అవస్థలు