IndiGo | నిర్వహణపరమైన లోపాల వల్ల దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో (IndiGo) విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోన్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది (IndiGo Flight Cancellations). గురువారం ఒక్కరోజే ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశ వ్యాప్తంగా 550 విమానాలు రద్దయ్యాయి. ఇక వరుసగా నాలుగోరోజైన శుక్రవారం కూడా ఈ పరిస్థితి కొనసాగింది. దాదాపు 400 విమానాలు రద్దయ్యాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులకు పడిగాపులు తప్పలేదు. ఫలితంగా విమానాశ్రయాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో విమానాలను ఇండిగో రద్దు చేసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపు 225 విమానాలు రద్దైనట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌లో ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు విమానాశ్రయాలకు బయల్దేరే ముందు విమాన స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది.
225 IndiGo arrivals and departures have been cancelled since this morning at Delhi Airport.
Source: Delhi Airport
— ANI (@ANI) December 5, 2025
ఇక బెంగళూరులోని కంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. బెంగళూరుకు రావాల్సిన 52 విమానాలు, వెళ్లాల్సిన 50 విమానాలు రద్దైనట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ముంబై ఎయిర్‌పోర్టులో 104 విమానాలు రద్దయ్యాయి. అందులో 53 విమానాలు ముంబై నుంచి వెళ్లాల్సినవి కాగా, 51 విమానాలు ముంబై ఎయిర్‌పోర్టుకు రావాల్సినవి.
Karnataka | 52 arrivals and 50 departures of IndiGo have been cancelled today so far at Kempegowda International Airport, Bengaluru. Next update will be shared post 6 PM: Kempegowda International Airport Bengaluru Spokesperson
— ANI (@ANI) December 5, 2025
ఇక హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోనూ దాదాపు 100 విమానాలు రద్దయ్యాయి. మొత్తం 92 విమానాలు రద్దైనట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43 కాగా, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 ఉన్నాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ఇన్ అయిన తర్వాత రద్దు సమాచారం ఇవ్వడంపై నిరసన తెలిపారు. మరోవైపు విశాఖ నుంచి 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌కు వెళ్లాల్సినవి ఉన్నాయి.
Status for IndiGo flights at Mumbai Airport: Planned cancellation for 05.12.2025 (from 0001 IST to 2359 IST)
Departure flights – 53 nos.
Arrival flights – 51 nos.
Total cancellations: 104
Updates will be shared as and when there are any further cancellations: Mumbai…— ANI (@ANI) December 5, 2025
Hyderabad, Telangana | As of now, IndiGo Cancellations for 5th December- Arrivals: 43; Departures: 49
Source: GMR Airports Limited PRO
— ANI (@ANI) December 5, 2025
గత నెలలో 1,232 సర్వీసులు రద్దు
గత నెలలో ఇండిగోకు చెందిన 1,232 విమాన సర్వీసులు రద్దు కాగా గణనీయ స్థాయిలో జాప్యం ఏర్పడింది. ప్రతిరోజూ దాదాపు 2,300 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడిపే ఇండిగో గడిచిన రెండు రోజులుగా విమాన సర్వీసులకు ఏర్పడిన తీవ్ర అంతరాయంపై స్పందిస్తూ ఊహించని సమస్యలు తలెత్తాయని పేర్కొంది. వివిధ విమానాశ్రయాలలోని పార్కింగ్ ప్రదేశాలను ఇండిగో విమానాలు ఆక్రమించుకోవడంతో ఇతర ఎయిర్‌లైన్స్ నడిపే విమానాలు జాప్యాన్ని ఎదుర్కోవలసి వస్తున్నది.
ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు కావాలి
పైలట్ల విశ్రాంతి, డ్యూటీ నిబంధనల నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇండిగో కోరింది. ఏ320 విమానాల నైట్ డ్యూటీ సేవలకు ఈ మినహాయింపునివ్వాలని కోరింది. కొత్త నిబంధనల ప్రకారం సిబ్బంది అవసరాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలిపింది. ప్రణాళికాలోపాల వల్ల తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేరని చెప్పింది.
Also Read..
Cyclone Ditwah | శ్రీలంకను కుదిపేసిన దిత్వా .. 486 మంది మృతి