హరిద్వార్: ముర్సీదాబాద్‌లో బాబ్రీ మసీదు లాంటి మసీదును నిర్మిస్తామని టీఎంసీ ఎమ్మెల్యే హుమయున్ కబీర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ స్వామి అవిముక్తేశ్వరానంద(Swami Avimukteshwaranand) సరస్వతీ మహారాజ్ స్పందించారు. బాబర్ ఓ ఆక్రమణదారుడని, ఆయన అనేక ఘోర నేరాలకు పాల్పడ్డారని, ఒకవేళ ఎవరైనా బాబర్‌తో పోల్చుకుంటే, వాళ్లను తాము ఆక్రమణదారులుగా భావిస్తామని, వారికి తగిన రీతిలోనే ట్రీట్ చేస్తామని అవిముక్తేశ్వరానంద అన్నారు. మసీదు నిర్మాణానికి వ్యతిరేకం కాదు అని, కానీ బాబ్రీ పేరుతో మసీదును నిర్మిస్తే, అప్పుడు దానికి తగినట్లు రియాక్ట్ అవుతామని స్వామీజీ అన్నారు.
బాబ్రీ మసీదు నిర్మిస్తామని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే హుమయున్ కబీర్‌ను తృణమూల్ పార్టీ సస్పెండ్ చేసింది. బెల్దంగా ప్రాంతంలో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే కబీర్ ఉన్నారు. అయితే శుక్రవారం తృణమూల్ పార్టీ నుంచి ఆయన తప్పుకుంటారని తెలిసింది. ఎమ్మెల్యే కబీర్ చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు ఎత్తుగడతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మమత అన్నారు.
#WATCH | Haridwar, Uttarakhand | On TMC MLA Humayun Kabir’s announcement to build a Babri Masjid, Shankaracharya Swami Avimukteshwaranand Saraswati Maharaj says, “… Babar was an invader, and he has committed grave atrocities. If anyone identifies themself as related to Babar,… pic.twitter.com/ga26C03PSe
— ANI (@ANI) December 5, 2025