Game of Thrones | ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) యూనివర్స్ నుంచి మరో కొత్త వెబ్ సిరీస్ రాబోతుంది. ఇప్పటికే ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ (House of the Dragon) అంటూ ప్రీక్వెల్‌ను తీసుకువచ్చిన మేకర్స్ తాజాగా మరో ప్రీక్వెల్‌ను అనౌన్స్ చేసింది. ఈ సిరీస్‌లలో అతి ముఖ్యమైన పాత్ర అయిన నైట్ సోల్జర్‌పై ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. ఏ నైట్ ఆఫ్ ది సెవన్ కింగ్డమ్స్ (A Knight of the Seven Kingdoms) అంటూ రాబోతున్న ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది జనవరి 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రధాన కథ కంటే సుమారు వంద సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని ఈ సిరీస్ రూపొందించబడింది. ప్రఖ్యాత రచయిత జార్జ్ R. R. మార్టిన్ రచించిన ‘The Tales of Dunk and Egg’ నవల ఆధారంగా రాబోతుంది.
ఈ కథ వెస్టరోస్లో ప్రయాణించే సెర్ డన్కన్ ది టాల్ (Ser Duncan the Tall), ఎగ్ (Egg) అనే ఇద్దరు విభిన్నమైన వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. టార్గారియన్ వంశం ఐరన్ థ్రోన్ను పాలిస్తున్న సమయంలో ఈ ఇద్దరు స్నేహితుల సాహసోపేతమైన, సవాలుతో కూడిన ప్రయాణాన్ని ఈ సిరీస్ ఆవిష్కరించనుంది. ఈ సిరీస్‌ను ‘Game of Thrones’, ‘House of the Dragon’ కంటే కాస్త భిన్నంగా, హాస్యభరితమైన అంశాలతో కూడిన ‘పాత్ర-ఆధారిత డ్రామా’గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి.