న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు.. భగవద్గీత గ్రంధాన్ని ప్రధాని మోదీ(PM Modi) బహూకరించారు. రష్యన్ భాషలో తర్జుమా చేసిన గీతా పుస్తకాన్ని పుతిన్‌కు అందజేశారు. ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని తెలిపారు. గీతా బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తున్నట్లు మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ధర్మాన్ని పాటించాలని చెబుతూ అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతా సారాన్ని బోధించారు.
Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world.@KremlinRussia_E pic.twitter.com/D2zczJXkU2
— Narendra Modi (@narendramodi) December 4, 2025
వ్లాదిమిర్ పుతిన్ పదోసారి ఇండియాకు వచ్చారు. గురువారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యేక విందులో పాల్గొన్నారు. 7 లోక్ కళ్యాన్ మార్గ్ నివాసంలో పుతిన్‌కు మోదీ విందు ఏర్పాటు చేశారు. ఇవాళ పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు చర్చలు నిర్వహించనున్నారు.