ఎస్సై భార్య ఆత్మహత్య.. గన్నేరుపూలు మిక్సీ చేసుకొని తాగి సూసైడ్.. కరీంనగర్లో విషాదం
ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. వన్‌టౌన్ సీఐ రామచంద్రరావు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది.
కరీంనగర్ విద్యానగర్, మార్చి 18: ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. వన్‌టౌన్ సీఐ రామచంద్రరావు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటుండగా.. చంద్రశేఖర్ టూటౌన్లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు.
చంద్రశేఖర్ రోజుమాదిరిగా మంగళవారం ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగింది. విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పింది. సమాచారం తెలిసిన భర్త దివ్యను హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దివ్య తండ్రి సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

