నాగర్‌కర్నూల్ టౌన్/కోడేరు, మార్చి 3 : నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని స్కానింగ్ సెంటర్ బాత్రూమ్లో బాలిక ప్రసవించిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఈ నెల 2న కడుపునొప్పితో బాధపడుతుండగా.. ఆమె తల్లి నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన డాక్టర్ సూచన మేరకు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లారు.
ఆ సమయంలో నొప్పులు రావడంతో అక్కడే ఉన్న బాత్రూమ్లోకి తల్లి తీసుకెళ్లింది. లోపలికి వెళ్లగానే బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువును అక్కడి చెత్తబుట్టలో పడే సేందుకు తల్లీబిడ్డలు యత్నించగా నిర్వాహకుల సమాచారంతో పోలీసులకు చేరుకొని ఇద్దరిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై జీసీడీవో శోభారాణి మంగళవారం బాలిక చదువున్న కళాశాలకు వెళ్లి ఆరాతీశారు. గర్భం రావడానికి బాధ్యుడైన బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు తెలిసింది.