Modi – Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు ప్రధాని మోదీ (PM Modi) ఘనంగా స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ తన ఫ్రెండ్‌కు వెల్కమ్ చెప్పారు మోదీ. అనంతరం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇద్దరూ నేతలూ తాము వాడే విలాసవంతమైన కార్లను కాకుండా సాధారణ టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) వైట్ కారులో వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దీని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రధాని మోదీ రేంజ్‌రోవర్ కారును ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇక రష్యా అధ్యక్షుడైతే.. అత్యంత ఖరీదైన, భద్రతతో కూడిన ఆరస్ సెనెట్ కారును ఉపయోగిస్తారు. అయితే, తాజాగా ఈ రెండు కార్లను కాకుండా సాధారణ ఫార్చ్యూనర్ కారులో మోదీ, పుతిన్ ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది.
వీరు ప్రయాణించిన ఫార్చ్యూనర్ సిగ్మా 4 ఎంటీ వాహనం MH01EN5795 మహారాష్ట్ర నంబరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ బీఎస్-6 వాహనం 2024 ఏప్రిల్‌లో రిజస్టర్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ కారుకు 2039 ఏప్రిల్ వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ జూన్ 2026 వరకు చెల్లుబాటు అవుతుంది. రష్యా అధినేతను తీసుకెళ్లేందుకు మోదీ ఈ కారును వాడటం హాట్ టాపిక్‌గా మారింది. విదేశాల్లో కూడా తన సొంత కారును వదలని పుతిన్.. ఇప్పుడు సాధారణ కారులో ప్రయాణించేందుకు అంగీకరించడం విశేషం.
Also Read..
“Delhi On High Alert | ఢిల్లీలో హై అలర్ట్.. భారీగా పోలీసులు మోహరింపు”
“PM Modi: భగవద్గీతను పుతిన్‌కు బహూకరించిన మోదీ”