Road accident : కారు అదుపుతప్పి కొండ పైనుంచి ఫల్టీలు కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం కులూ జిల్లా (Kulu district) లోని రోహ్తాంగ్ పాస్ (Rohtang pass) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహ్నీనలా (Rahninala) సమీపంలోని పర్వతం (Mountain) పైనుంచి కారు ఫల్టీలు కొడుతూ కిందకు పడిపోయింది.
కారులో మొత్తం ఐదుగురు ఉండగా ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందిన వెంటనే మనాలీ పోలీసులు, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతులు, క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
#WATCH | Himachal Pradesh: Four people died after their car slipped off the road and fell down the mountain near Rahninala, Rohtang Pass in Kullu district. There were a total of five people in the vehicle. One person is seriously injured. Rescue operations are still on. The dead… pic.twitter.com/kOIO6qr6qj
— ANI (@ANI) July 6, 2025